కలెక్టర్లకు క్లాస్ పీకిన సీఎం రేవంత్
NEWS Jul 21,2025 07:59 pm
జిల్లా కలెక్టర్లు ఆఫీసుల్లో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులు, పేద ప్రజలకు అధికారుల మూలానా ఏమాత్రం నష్టం జరిగినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇంఛార్జి మంత్రి కలిసి రేషన్ కార్డులు పంపిణి చేయాలన్నారు .