బజార్హత్నూరు మండలం వర్తమానూరు గ్రామానికి చెందిన నలువాల ఆకాష్ ఆర్మీ జవాన్ సోమవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అస్సాం రైఫిల్ జీడి విభాగంలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. రైఫిల్ రెజిమెంట్‌లో శిక్షణలో భాగంగా డీహైడ్రేషన్‌కు గురై మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పేర్కొన్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.