ద్విచక్ర వాహనం నడిపిన ఎమ్మెల్యే
NEWS Jul 21,2025 09:59 pm
పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జైనథ్ మండల కేంద్రంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ వ్యవసాయ పొలాలకు చేరుకున్నారు. పొలంబాట కింద వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.