గన్నేరువరం: సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారు CEIR సేవలను వినియోగించుకోవాలని ఎస్ఐ నరేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన చావుల మధుకర్ సెల్ ఫోన్ను CEIR విధానం ద్వారా గుర్తించి 24 గంటల్లోనే బాధితులకు హెడ్ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి అందజేశారు. ఫోన్ పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్లో CEIR ద్వారా ఫిర్యాదు చేసి ఫోన్లు తిరిగి పొందాలని సూచించారు.