'26 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం'
NEWS Jul 21,2025 05:07 pm
240 కోట్ల రూపాయలతో 26 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు చొప్పదండి మండలంలో శరవేగంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. సాంబయ్య పల్లె, గుమ్లాపూర్ గ్రామాల్లో సోమవారం పార్టీ జెండాను ఆవిష్కరించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుమ్లాపూర్, సాంబయ్య పల్లి, కాట్నపల్లి గ్రామాల చెరువులను నింపి సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.