38 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!
NEWS Jul 21,2025 04:20 pm
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ హైస్కూల్లో 1986-87 టెన్త్ బ్యాచ్కు చెందిన విద్యార్థులంతా ఈరోజు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో బిజీగా ఉన్నవారంతా 38 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. అర్ధంతరంగా తనువు చాలించిన తోటి మిత్రులను గుర్తు చేసుకున్నారు. మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు.