కోనేరు హంపికి జగన్ కంగ్రాట్స్
NEWS Jul 21,2025 02:21 pm
ఫైడ్ మహిళల చెస్ ప్రపంచ కప్ సెమీస్ కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచిన ఏపీకి చెందిన చెస్ క్రీడాకారిణి కోనేరు హంపిని అభినందనలతో ముంచెత్తారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మీ విజయం భారతదేశానికి గర్వకారణమని, దేశ వ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభకు నిజమైన ప్రేరణ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విజయాలు సాధించాలని కోరారు.