తుంగభద్ర డ్యామ్ కు వరద ప్రవాహం
NEWS Jul 21,2025 02:15 pm
ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1625.96 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 36,813 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 39,228 క్యూ సెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 79.665 టీఎంసీలుగా ఉంది.