గోవిందరావుపేట (మం) పస్రా గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న గుండ్ల వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడు వరంగల్ జిల్లా ఎనుమల మార్కెట్ ప్రాంతానికి చెందిన ఈసంపల్లి మణికుమార్ గా గుర్తించారు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రి తరలించారు.