22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్ర స్థావరాలు ఖతం
NEWS Jul 21,2025 10:55 am
కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను లేపేశామన్నారు ప్రధాని మోదీ. మేడిన్ ఇండియా ఆయుధాలతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామన్నారు. వాడిన ఆయుధాలు వాటి సత్తా నిరూపించుకున్నాయని అన్నారు మావోయిస్టు ముక్త్ భారత్లో ముందడుగు వేశామన్నారు. దేశంలో మావోయిజం దాదాపుగా అంతమైందన్నారు.. అనేక ప్రాంతాలను మావోయిస్టుల నీడ నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. వందలాది జిల్లాలు నక్సల్ ఫ్రీ జోన్లుగా మారిపోయాయని తెలిపారు.