ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి . ఎమ్మెల్యే బోనాల వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఘటన జరిగిందన్నారు. ఆరు వాహనాలలో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. యువకుల వాహనాలకు సైడ్ ఇవ్వక పోవడమే వాగ్వాదానికి కారణం అని తేలిందన్నారు. సీసీ కెమెరా దృశ్యాల బట్టి యువకులు అడిక్‌మెట్ వైపు వెళ్లినట్లు గుర్తించామన్నారు.