ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు రాజకీయ కుట్ర
NEWS Jul 21,2025 10:37 am
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ కుట్రలో భాగంగానే మిథున్‌రెడ్డి అరెస్ట్ అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు వాంగ్మూలాల ద్వారా తప్పుడు కేసులో ఇరికించారని.. టీడీపీ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ఇలా చేశారని మండిపడ్డారు.