అమర్‌నాథ్ యాత్ర.. 18 రోజుల్లో మూడు లక్షలకు పైగా మంది దర్శనం
NEWS Jul 21,2025 09:39 am
అమర్‌నాథ్ యాత్రకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 3న యాత్ర ప్రారంభం కాగా.. 18 రోజుల్లో మూడు లక్షలకు పైగా మంది భక్తులు హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆదివారం నాటికి 3.07 లక్షల మంది యాత్రికులు పవిత్ర దర్శనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఆగస్టు 9న యాత్ర ముగియనుంది. ఇంకా 20 రోజులు మిగిలి ఉన్నందున ఈ ఏడాది 3.50 లక్షలకు పైగా మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉందని అధికారిక అంచనా.