బీజేపీ చెప్తే నా పదవికి రాజీనామా చేస్తా
NEWS Jul 20,2025 08:23 pm
పార్టీ నుండి సస్పెండ్ అయిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక ప్రకటన చేశారు. బీజేపీ చెపితే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఇంకొకరు చెబితే తాను చేయనంటూ స్పష్టం చేశారు. తాను కొత్త పార్టీ పెట్టడం లేదని, ఆ ప్రచారం అబద్దమన్నారు. తాను ఏ పార్టీలో చేరబోనంటూ వెల్లడించారు రాజా సింగ్ .