ఎమ్మెల్సీ కవితని కలిసిన సంపత్ గౌడ్
NEWS Jul 20,2025 09:32 pm
హైదరాబాద్‌లో బోనాలు పండుగ ఆదివారం ఘనంగా జరిగింది. ఆషాడ మాసంలో ఈ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శుభాకాంక్షలు స్వీకరించారు. తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ తదితరులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు.