అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల సందడితో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.