బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు
NEWS Jul 20,2025 02:12 pm
సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ సినీ పరిశ్రమలో తన అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో కుల వివక్ష ఉందని, తాను దళితుడినని తెలిసిన తర్వాతే తనకు సినిమా అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని వెల్లడించారు. ఇండస్ట్రీలో ప్రతిభకు బదులు కులానికే ప్రాధాన్యత ఉంటుందన్న బాబుమోహన్ వ్యాఖ్యలు సినీ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.