CMRF ద్వారా ఆర్థిక సహాయం పొందాలి - MLA
NEWS Jul 20,2025 08:10 am
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని 45 మంది లబ్ధిదారులకు రూ. 12 లక్షల విలువ గల CMRF చెక్కులను అందజేశారు. ఆరోగ్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమర్పించి ఆర్థిక సాయం పొందాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.