హరి హర వీరమల్లు మూవీ టికెట్లు భారీగా పెంపు
NEWS Jul 20,2025 12:33 am
హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 100 నుంచి రూ.150 వరకు, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచేందుకు చిత్ర నిర్మాత అనుమతి కోరాడు. కాగా మొదటి 10 రోజులకే టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం కల్పించింది.