పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
NEWS Jul 19,2025 04:07 pm
మావల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా SP అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. విధినిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల గౌరవంగా వ్యవహరించి సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు.