SC హాస్టల్ ను సందర్శించిన కనిగిరి ఎమ్మెల్యే
NEWS Jul 19,2025 04:12 pm
కనిగిరి గార్ల పేట రోడ్ లో ఉన్న ఎస్సీ హాస్టల్ ను ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి సందర్శించారు. హాస్టల్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి అధికారులతో మాట్లాడారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులతో వసతి, సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మూడు పూటల రుచికరమైన భోజనాన్ని అందించాలని ఈ సందర్భంగా సూచించారు.