విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్ అభిలాష
NEWS Jul 19,2025 04:16 pm
నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరితోపాటు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా విద్యాధికారి రామారావు ఉన్నారు. ముందుగా పాఠశాలలు విద్యార్థుల అభ్యాసన తీరును పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ స్వయంగా బోధన చేశారు. వివిధ పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల అధ్యయనాన్ని పరీక్షించారు.