ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
NEWS Jul 19,2025 03:12 pm
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని సోన్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెఎల్పి నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని దుర్భాష లాడటం సమంజసం కాదని, ఇలాంటివి పునరావృతం చేస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..