బిడ్డా కొడుకా ఖబడ్దార్ - ఈటల రాజేందర్
NEWS Jul 19,2025 02:45 pm
మాటల తూటాలు పేల్చారు ఎంపీ ఈటల రాజేందర్. వాడు సైకోనా శాడిస్టా మనిషా లేక పశువా అంటూ మండిపడ్డారు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో వెనుక ఉన్నది ఎవడో త్వరలోనే తేలుతుందన్నాడు. మనది నేరుగా పోరాడుతాం తప్పా స్ట్రీట్ ఫైట్ కాదన్నారు. కాలం అన్నింటిని గమనిస్తుందని ఏదో ఒక రోజు గుణపాఠం ఇచ్చి తీరుతుందన్నారు. హుజూరాబాద్ గడ్డ మీద ప్రతి ఊర్లో మనమే ఉంటాం, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా అన్నింట్లో మనమే ఉండి తీరుతామన్నారు. వాడెవడు చెప్పడానికి నన్ను హెచ్చరించడానికి అంత ధైర్యం ఎక్కడిదని ప్రశ్నించారు.