ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా - ఎమ్మెల్యే
NEWS Jul 19,2025 02:47 pm
నేరడిగొండ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనిలో హనుమాన్ మందిర షెడ్డు నిర్మాణానికి MLA అనిల్ జాదవ్ శనివారం భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అనిల్ జాదవ్ పేర్కొన్నారు...