విశాఖ ఐటీసీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం .. భారీగా ఆస్తినష్టం
NEWS Jul 19,2025 09:47 am
ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విశాఖ గండిగుండంలోని ఐటీసీ గోడౌన్‌లో ఈరోజు ఉదయం మంటలు చెలరేగాయి. సిగరెట్లు, బింగో ప్యాకెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.