టీటీడీ ఈవో పేరుతో ఫేక్ అకౌంట్
NEWS Jul 19,2025 09:42 am
టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి, భక్తులకు సందేశాలు పంపుతూ డబ్బులు కావాలని కోరుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇది పూర్తిగా మోసగాళ్ల నకిలీ చర్యగా గుర్తించడం జరిగిందని పేర్కొంది. భక్తులు ఇటువంటి నకిలీ అకౌంట్లకు దూరంగా ఉండాలని, ఎవరికైనా ఇలాంటి సందేహాస్పద సందేశాలు వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన సెల్ నెం: 9866898630. లేదా టీటీడీ టోల్ ఫ్రీ నెం: 18004254141 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని కోరింది.