హైదరాబాద్ అతలాకుతలం
NEWS Jul 19,2025 09:14 am
హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది వర్షం. చెరువులను తలపించాయి రహదారులు, ఫ్లైఓవర్లు. ఎక్కడికక్కడే స్తంభించి పోయింది ట్రాఫిక్. గంటలకొద్దీ నరకయాతన అనుభవించారు వాహనదారులు. కంటోన్మెంట్, బోయిన్పల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. గోడలు కుప్ప కూలాయి. హైడ్రా, GHMC, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.