మరో నాలుగు రోజులు వర్షాలు
NEWS Jul 19,2025 09:04 am
వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రానికి వర్షాలు వస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.