ఎమ్మెల్యే భాను ప్రకాశ్ పై లక్ష్మీ పార్వతి ఫైర్
NEWS Jul 18,2025 12:43 pm
మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే భాను ప్రకాశ్ పై సీరియస్ అయ్యారు వైసీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి. మీ నాన్న నీతిమంతుడని, నువ్వెందుకు ఇలా తయారయ్యావంటూ మండిపడ్డారు. తను చేసిన కామెంట్స్ అత్యంత జుగుస్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలన్న సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.