స్టార్ క్రికెటర్ స్మృతి మందన్నా బర్త్ డే టుడే
NEWS Jul 18,2025 09:59 am
భారతీయ మహిళా క్రికెటర్ స్మృతీ మందన్నా పుట్టిన రోజు ఇవాళ. జూలై 18, 1996లో ముంబైలో పుట్టారు. ప్రపంచ మహిళా విభాగంలో మోస్ట్ పాపులర్ ప్లేయర్ గా గుర్తింపు పొందారు. ఎడమ చేతి బ్యాటర్ గా అనేక రికార్డులు నమోదు చేసింది. అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్ లో తనకంటూ స్థానం సంపాదించుకుంది. ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో తొలి 10 ఓవర్లలో సిక్సర్ బాదిన తొలి ఉమెన్ బ్యాటర్ గా స్మృతి మంధాన నిలిచింది. ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో దిట్ట. ఫోర్లు, సిక్సర్లు అవలీలగా బాదడంలో గుర్తింపు పొందారు.