ఆయిల్ ఫామ్ పంటల విస్తీర్ణం పెంచేందుకు చర్యలు
NEWS Jul 17,2025 09:35 pm
నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటల విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ పంటల సాగుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం లో భాగంగా జిల్లాకి 4500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకి నీటి వసతి ఉన్న రైతులను గుర్తించి, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలన్నారు.