బాయ్స్ హాస్టల్ తనిఖీ చేసిన మంత్రి స్వామి
NEWS Jul 15,2025 06:35 am
ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. కురిచేడు అంబేద్కర్ గురుకుల పాఠశాల, పొదిలి ఎస్సీ బాయ్స్ హాస్టల్ ని మంత్రి స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య మెరుగుపరచాలని పాఠశాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు మంత్రి స్వామి.