పేర్ని నానికి సోమిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
NEWS Jul 14,2025 06:49 pm
మాజీ మంత్రి పేర్ని నాని సోయి లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి . చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ, మీ నేత జగన్ రెడ్డికి లేదన్నారు. తమ నాయకుడి పేరు చెబితే జడుసుకుంటారని ఎద్దేవా చేశారు. ఆనాడు మీరంతా మాట్లాడిన బూతులు ఈనాటికీ ప్రజలు మరిచి పోలేదన్నారు. రప్పా రప్పా అంటూ మీ నాయకుడు ఓ సినిమా తీస్తే సరి పోతుందన్నారు.