భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. అవకాశం వస్తే తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అరెస్ట్ హెచ్‌సీఏకు అవమానం అన్నారు. అదనపు టికెట్లకు ఓప్పుకోకపోతే వేధించడం దారుణమన్నారు. తక్షణమే అసోసియేషన్ రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.