ఈఎంఐ కట్టలేదని ఎమ్మెల్యే కారు తీసుకెళ్లారు
NEWS Jul 14,2025 06:03 pm
EMI కట్టలేదని జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ కారును తీసుకెళ్లారు ఫైనాన్స్ వ్యాపారులు. ఈసందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. ఒకప్పుడు గొప్పగా బతికిన కుటుంబం తమదని, కానీ ఇప్పుడు పేదరికంలో ఉన్నామని వాపోయారు. రాజకీయాల కారణంగా అప్పుల పాలయ్యానని వాపోయారు. కిస్తీ కట్ట లేదని తన కారును ఫైనాన్స్ వాళ్లు తీసుకు పోయిన మాట వాస్తవమేనని అన్నారు. ప్రస్తుతం తాను అల్లుడి కారు వాడుతున్నానని తెలిపాడు.