సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత
NEWS Jul 14,2025 05:23 pm
ప్రముఖ సీనియర్ నటి సరోజాదేవి సోమవారం బెంగళూరు మల్లేశ్వరంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 87 ఏళ్లు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.