నటించడంలో ప్రశాంతి రెడ్డి టాప్
NEWS Jul 14,2025 05:18 pm
మాజీ మంత్రి పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆమె మహా నటి అంటూ ఎద్దేవా చేశారు. నటించడంలో తనకు తానే సాటి అంటూ పేర్కొన్నారు. తను కావాలని తమ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. ఇలాగే కూటమి సర్కార్ వేధింపులకు పాల్పడితే, అక్రమ కేసులు నమోదు చేస్తే, అరెస్ట్ లు చేస్తే తాము కోర్టులో తేల్చుకుంటామన్నారు. దాడి చేసింది కాక తమనే టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు నాని.