బీజేపీ విధానం బీసీలకు వ్యతిరేకం - పొన్నం
NEWS Jul 14,2025 04:38 pm
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అసహనంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్డినెన్స్ ఎట్లా చెల్లుబాటు అవుతుంది అని ప్రశ్నించడం తనకు బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నాడు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతోనే లోకల్ బాడీ ఎన్నికలు ఆపామన్నారు. మీరు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించడం లేదంటూ ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీజేపీ విధానమే బీసీ వ్యతిరేక విధానమన్నారు.