చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
NEWS Jul 14,2025 04:08 am
రప్పా రప్పా అనొద్దని కార్యకర్తలకు చెప్పానని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 8వ తేదీన మాట్లాడితే.. 12న టీడీపీ శ్రేణులు హడావుడి చేశారని ఆరోపించారు. చీకట్లో నరకమని చెప్పానంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటున్నారని, ఆయనను ఈంచు కూడా కదిలించ లేరంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని. సీఎంకు అంత సీన్ లేదన్నారు. తాను అనలేని మాటలను అన్నానని దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు.