కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించాం
NEWS Jul 14,2025 03:59 am
సంస్థాగతంగా పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించడం జరిగిందని చెప్పారు మంత్రి సీతక్క. నేతల మధ్య అభిప్రాయ బేధాలు, క్రమశిక్షణ చర్యలపై ఎలాంటి చర్చ జరగ లేదని స్పష్టం చేశారు. చక్కటి వాతావరణంలో సమావేశం జరిగిందని, ఎలాంటి విమర్శలు, ఆరోపణలు లాంటివి చోటు చేసుకోలేదన్నారు. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలు తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు.