కవితపై మల్లన్న కామెంట్స్ తగదు - టీపీసీసీ
NEWS Jul 14,2025 03:57 am
ఎమ్మెల్సీ కవితపై మల్లన్న వ్యాఖ్యలు, మల్లన్న కార్యాలయంపై దాడిని ఖండించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అన్నారు. ఇతరులపై కామెంట్స్ చేసేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలని సూచించారు. దాడులు తెలంగాణ సంస్కృతి కాదన్నారు. బీసీ బిల్లు, రిజర్వేషన్లు అన్నీ కాంగ్రెస్ కృషి ఫలితమేనని చెప్పారు. ఈ అంశంపై లబ్ది పొందాలని ఇతరులు చూడడం సమంజసం కాదన్నారు.