బీసీల రిజర్వేషన్ల అంశంలో రాజకీయం వద్దు
NEWS Jul 11,2025 03:09 pm
కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కె. కేశవరావు బీసీల రిజర్వేషన్ల అంశంపై స్పందించారు. రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయొద్దని ఆయా పార్టీలకు సూచించారు. ప్రధానంగా బీఆర్ఎస్ పదే పదే కామెంట్స్ చేయడాన్ని తప్పు పట్టారు. జీవో ఇస్తే మళ్లీ కోర్టుకు వెళతారని అన్నారు. గులాబీ నేతలు పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.