రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఉంది
NEWS Jul 11,2025 11:40 am
ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడవడం లేదన్నారు. ప్రజాస్వామిక వాతావరణం ఉందన్నారు. సభలు, ధర్నాలకు ఎలాంటి కట్టడి, ఆంక్షలు లేవన్నారు. ఈ పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేదన్నారు. మీటింగ్‌లు పెట్టుకోవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పే నైతిక అర్హత కూడా ఆ పార్టీ నేతలకు లేదన్నారు.