కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు
NEWS Jul 10,2025 08:35 pm
కెనడాలో నూతనంగా ప్రారంభించిన ఇండియన్ కమెడియన్ కు చెందిన కేఫ్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కపిల్ షోతో తను పాపులర్ అయ్యారు. సెలిబ్రిటీస్ తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటారు. అత్యధిక రేటింగ్ తో తన షో కొనసాగుతోంది. ఇటీవలే తన పేరుతో కేఫ్ ను స్టార్ట్ చేశారు.