కార్మిక వ్యతిరేక కోడ్స్‌ని రద్దు చేయాలి
NEWS Jul 09,2025 03:02 pm
అమరచింత మండల కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. సంఘ నాయకులు మాట్లాడుతూ 8 గంటల పని దినాన్ని పోరాటం ద్వారా సాధించుకున్నాం. కేంద్ర ప్రభుత్వం 12 గంటల పని దినాన్ని చేయాలని 4 లేబర్ కోడ్స్ తీసుకు రావడం కార్మిక లోకానికి అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి, ఆశ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఆర్పిలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం కనీస వేతనాలు అమలు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.