లైంగిక వేధింపులు అబద్దం - క్రికెటర్ దయాల్
NEWS Jul 09,2025 11:26 am
ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్ ఎట్టకేలకు మౌనం వీడారు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని పేర్కొన్నారు. తాజాగా తనపై ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సదరు మహిళ తనతో ఇన్ స్టాలో కలిసిందని, వైద్య చికిత్స కోసం డబ్బులు కావాలంటే ఇచ్చానని తెలిపాడు. తిరిగి ఇస్తానని ఇవ్వలేదని, అడిగితే సెక్సువల్ గా వేధించానంటూ ఆరోపణలు చేసిందని వాపోయాడు. క్రికెటర్ కు సంబంధించిన కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు పోలీసులు.