ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు కన్నుమూత
NEWS Jul 09,2025 10:19 am
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొందిన వత్సల కన్నుమూసింది. మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్ హినౌటా రేంజ్‌లోని ఏనుగుల శిబిరంలో ఈ ఆడ ఏనుగు తుదిశ్వాస విడిచింది. హినౌటా క్యాంపులో అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. వత్సల వయస్సు ఎక్కువ కావడంతో కొంతకాలంగా ఎలాంటి పని చేయించకుండా, వైద్యుల పర్యవేక్షణలో అధికారులు ఉంచారు. ఇటీవల క్యాంపు సమీపంలోని చిన్న వాగులో జారి పడిన ఘటనలో గాయపడింది. 1971లో కేరళ నుంచి దీనిని తీసుకు వచ్చారు. వత్సల మృతిపై సీఎం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.