గిల్‌ను బ్రాడ్‌మాన్‌తో పోల్చిన రవిశాస్త్రి
NEWS Jul 09,2025 04:03 am
భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను క్రికెట్ లెజెండ్ సర్ బ్రాడ్‌మాన్‌తో పోల్చాడు మాజీ క్రికెటర్ రవిశాస్త్రి. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా 2వ టెస్టులో 336 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. కెప్టెన్ గా, ఆటగాడిగా గిల్ దుమ్ము రేపాడని, తను ఒక్కడే 430 పరుగులు చేశాడని ప్రశంసలు కురిపించాడు. గతంలో ఏ భారత క్రికెటర్ ఇలాంటి రికార్డ్ నమోదు చేయలేదన్నాడు. 5 టెస్టు మ్యాచ్‌ల సీరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలుపొంది సమానంగా ఉన్నాయి.