దనసరి సీతక్కా..జర నోరు జాగ్రత్త
NEWS Jul 09,2025 02:28 am
ఆదివాసీ బిడ్డ అనే కార్డు వాడుకుని కేటీఆర్ గురించి అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని మంత్రి సీతక్కకు వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మాలోతు కవిత. ఎన్నికల ముందు స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా నటించిందని, గెలిచాక మాఫియా డాన్ లాగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిజంగా గిరిజన బిడ్డవే అయితే జీవో 49 ఎందుకు రద్దు చేయలేదో సీతక్క చెప్పాలన్నారు. నీ అనుచరుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోలేదా అని ప్రశ్నించారు. ఇంకోసారి కేటీఆర్ గురించి నోరు జారితే బాగుండదన్నారు.